ర్యాపర్స్ అంటే భిన్నంగా ఉంటారని అందరికి తెలుసు. ఒక్కో ర్యాపర్ ఒక్కో స్టైల్ మెయిన్‌టెయిన్ చేస్తూ తమకంటూ ఓ ప్రత్యేకత ఉండేలా చూసుకుంటారు. చిత్ర విచిత్రమైన వేషాధారణను అనుసరిస్తుంటారు. ఈ క్రమంలో అయితే కొందరు మరీ పిచ్చిగా తయారవుతుంటారు. అయితే మెక్సికోకు చెందిన డ్యాన్‌సుర్ అనే ర్యాపర్‌కు ఆ పిచ్చి పీక్‌కు చేరింది. ప్రపంచంలోనే రాపర్స్ అందరికీ భిన్నంగా ఉండాలనే ఆలోచనతో పెద్ద సాహసమే చేశాడు.
డ్యాన్‌సుర్‌కి బంగారం అంటే చాలా ఇష్టం. అయితే ఆ ఇష్టాన్ని ఊహించలేని రూపంలో చూపించాడు. గుండు కొట్టించుకుని..జట్టు మొత్తం మొదళ్ల నుంచి తీయించుకుని.. వాటి స్థానంలో బంగారం గొలుసులు ఇంప్లాంట్ చేసుకున్నాడు. జుట్టు బదులు అతని మొహం మీదుగా బంగారు గొలుసులే వేలాడుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను డ్యాన్‌సుర్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకోగా.. అవి వైరల్‌గా మారాయి.జుట్టే కాదు.. తన పళ్లను కూడా బంగారంతో కోటింగ్ చేయించుకున్నాడు. అందరికంటే భిన్నంగా ఉండాలనే ఈ పని చేసినట్టు డ్యాన్‌సురో చెబుతున్నాడు. దాదాపు తనను ఎవరు అనుకరించబోరనే ఆశాభావం వ్యక్తం చేశాడు.
Advertisements