డైనోసార్స్ కంటే పురాతనమైన చేపకి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ చేపకు సంబంధించిన వార్త నెట్టింట్ వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. కీత్ డీస్, హంట్లీ అనే తండ్రీ కొడుకులు గత నవంబర్ లో అలబామాలో చేపల వేటకు వెళ్లారు. సాధారణంగానే నీటిలో వల విసిరారు. ఆ తర్వాత ఆ బరువెక్కిన వలను పైకి లాగే క్రమంలో షాక్ తిన్నారు. వారికి దొరికింది చేపనా లేక ఇతర జీవినా? అనే సందేహం వచ్చింది. దీంతో వింతగా కనిపించిన ఆ చేపను వెంటనే అధికారులకు చూపించారు.
అధికారులు తనిఖీ చేయగా.. వారి వలలో పడ్డ చేప అరుదైన జాతికి చెందినదిగా గుర్తించారు. అందులోనూ అది డైనోసార్స్ కంటే పురాతనమైది. అతి అరుదైన ‘సజీవ శిలాజ’ ఫిష్ గా తెలిసి వారు ఆశ్చర్యపోయారు. భయంకర క్యాచ్ డైనోసార్ల కంటే కూడా ఈ చేప పురాతనమైనదిగా తెలిసి ఆశ్చర్యపోయారు.
ఇది వారి ఫిషింగ్ హ్యబిట్ లో రికార్డు-బ్రేకింగ్ ఆవిష్కరణగా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన విషయాన్ని, ఆ ఫిష్ ఫొటోలను తండ్రీ కొడుకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది కాస్తా వైరల్ అయింది. ఈ చేప అధికారికంగా ఆరెంజ్ బీచ్ మెరీనాలో తూకం వేయబడింది. ఇది 162lbs (73.5kg) బరువుంది.
ఇది మునుపటి అలబామా రాష్ట్ర రికార్డును 11lbs అధిగమించింది. ఈ ఫిష్ సుమారు సుమారు 7 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. అయితే కొన్ని 10 అడుగుల వరకు కూడా పెరుగుతాయంటున్నారు. రేజర్-పదునైన దంతాలతో కప్పబడిన పొడవాటి ముక్కు కారణంగా వీటికి ఈ పేరు వచ్చింది.