వైద్య రంగంలో నిత్యం ఏదోక అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రాణాలు కాపాడటానికి వైద్యులు నిత్యం కష్టపడుతూ వినూత్న అడుగులు వేస్తున్నారు అనే మాట వాస్తవం. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలు లేకపోతే మాత్రం కచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇటీవల మన హైదరాబాద్ లో తొలిసారి వైద్యులు చర్మం కూడా సేకరించడం, ఇతరులకు అమర్చడానికి ప్రయత్నం చేయడం కూడా సంచలనం అయింది.
ఇక ఇప్పుడు తాజాగా మన హైదరాబాద్ లోనే మరో సంచలనం కూడా నమోదు అయింది. కిమ్స్ ఆసుపత్రి వైద్యులు ఆసియాలోనే మొట్టమొదటిసారిగా ఓ బాలుడికి ప్రాణాలను కాపాడటానికి పెద్ద రిస్క్ చేసారు. 65రోజుల పాటు ఎక్మోపై చికిత్స అందించి చిన్నారి ప్రాణాలను కాపాడారు. కిమ్స్ వైద్యులు సందీప్ అత్తావర్, అభినయ్ బొల్లినేని, విజయ్ మీడియా సమావేశాన్ని బాలుడి కుటుంబ సభ్యులతో కలిపి ఏర్పాటు చేసి ఈ విజయవంతమైన వైద్యం గురించి వివరించారు.
అయితే ఆ బాలుడిది హైదరాబాద్ కాదు. ఉత్తరాదికి చెందిన 12ఏళ్ల శౌర్య అనే బాలుడు అక్టోబర్‌లో తీవ్ర లంగ్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడటంతో ఎయిర్ అంబులెన్స్ సాయంతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చాడు. ఆ సమయంలో అతనికి అనేక పరిక్షలు చేసిన వైద్యులు అతని ఊపిరితిత్తులు పాడు అయ్యాయని వైద్యం ఎక్కువగా చేయాలని, ఇతర అవయావలపైన కూడా ప్రభావం చూపినట్టు చెప్పారు. దీనితో అప్పటి నుంచి డిశ్చార్జ్ వరకు కూడా… బాలుడిని 65 రోజుల పాటు ఎక్మోపై ఉంచి… శారీరక వ్యాయామం, పోషకాహారంతో పాటు సరైన మందులు అందించి ప్రాణాలను నిలబెట్టారు. ఆసియా ఖండం లో ఇన్ని రోజులు ఎక్మో మీద ఉన్న చిన్నారిగా అతను రికార్డ్ సృష్టించాడు.