టీవీ9 అవలంభిస్తోన్న పద్దతిపై ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఫైర్ అయ్యారు. తెలంగాణ బలిదానాలను, సంస్కృతిని చిన్నచూపు చూస్తూ… విషం చిమ్ముతోందని ఆరోపించారు. రవిప్రకాశ్‌ను జైల్లో పెట్టి… మా తెలంగాణ మైహోం రామేశ్వర్ రావు మీ టీవీ9ని కొన్నారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు రసమయి.
తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ రాష్ట్రాన్ని టీవీ 9 తక్కువగా చూస్తుందన్నారు మానకొండు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. తెలంగాణ ఉద్యమ సమయం లో టీవీ 9 మాకు వ్యతిరేకంగా పనిచేసిందని తెలిసినా, ఇప్పుడు తెలంగాణకు చెందిన మా మై హోం రామేశ్వర్ రావు తీసుకోవటంతో టీవీ 9 తెలంగాణ ఛానెల్ అనుకుని గౌరవంగా చెప్పుకుంటున్నామన్నారు.
తుపాకీ రాముడు అనే సినిమాని 3 కోట్లు ఖర్చుపెట్టి తీసిన, ఒక్క రూపాయి లేకపోయినా ఫైనాన్స్ తీసుకుని సినిమా తీసాను. ఆ సినిమా లో నా హీరో బిత్తిరి సత్తిని పెట్ట. డబ్బులు లేక జీతం లో జమ చేసుకుని తీసాను. దిల్ రాజు గారిని అడిగా ప్రమోషన్ చెయ్యండి అని కోరాను, ఎన్టీవీ టీవీ9 రెండు ఛానల్స్ కూడా నన్ను పట్టించుకోలేదు. ఏ ఛానల్ కి వెళ్లిన సత్తి టీవీ9 లో పని చేస్తున్నాడు, మేము ప్రమోషన్ చేయలేము అంటున్నారు, నా ఆస్తులు అమ్ముకుని నేను తీసిన సినిమాని దీపావళి రోజు ప్రొమోషన్ చెయ్యమని కోరితే కూడా మీరు చెయ్యలేదు. టీవీ 9 కు తెలంగాణ ప్రజలు నేను చేరిన ద్రోహం ఏంటో చెప్పండి. రామేశ్వర్ రావు వచ్చాడు, రవి ప్రకాశ్ ను జైలులో పెట్టారు అది మీ మీ రాజకీయాలు ఎమన్నా చేసుకోండి. ఎన్నో ప్రాణాలను త్యాగం చేసి తీసుకొచ్చిన తెలంగాణ పట్ల ఎందుకు ఇంత మీకు నిర్లక్ష్యం. నేను తీసిన సినిమా డబ్బులు కోసం సినిమా తియ్యలేదు. నేను తీసిన సినిమా బాగోలేదు అంటే నా తల తీసి టీవీ9 గుమ్మం ముందు పెడతాను. టీవీ9 ఒక్క అరగంట ప్రమోషన్ చేస్తే మీ ఛానల్ ఎవరైనా చూడటం మానేస్తారా, మా రామేశ్వర్ రావు ఛానల్ తీసుకున్నాడు అని అనుకున్నాం కానీ మీ బుద్దులు మార్చుకోలేదని అనుకోలేదు.
దయచేసి మీ బుద్దులు, మనసులు మార్చుకుని తెలంగాణ సంస్కృతిని మాత్రం బతికించండి అని కోరుకుంటున్నాను అంటూ టీవీ9 రజినీకాంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ… ఓ ఆడియో సందేశాన్ని పంపించారు.
రసమయి ఎం ఎన్నారో… ఈ ఆడియా క్లిప్‌లో మీరే వినండి.