రసమయి బాలకిషన్
కరీంనగర్ : ‘ఈటెల రాజేందర్‌కు, నాకు నిజాలు మాట్లాడటమే వచ్చు..కడుపులో ఏమీ దాచుకోము…’ అంటూ రసమయి బాలకిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల టీఆర్‌ఎస్ పార్టీలో లుకలుకలు బహిర్గతం అవుతున్ననేపథ్యంలో బాలకిషన్ వ్యాఖ్యలు ఆసక్తి పుట్టించాయి.
‘ఉద్యమంలో కొట్లాడినోల్లం.. మాకు అబద్దాలు రావు..’ అని బాలకిషన్ ఇంకా ఏదో చెప్పబోతుంటే, ‘జాగ్రత్తగా మాట్లాడు..’ అంటూ ఈటల నవ్వుతూ రసమయితో అనడం వినిపించింది. కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన టీచర్స్ డే వేడుకల్లో ఇదంతా జరిగింది.