దుల్కర్ సల్మాన్ – హను రాఘవపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుంది. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ మూవీలో… ఇద్దరు కథానాయికలున్నారన్న ప్రచారం సాగింది. ఓ హీరోయిన్ గా పూజా హెగ్డేని ఎంపిక చేయగా, రెండో కథానాయికగా రష్మిక నటించబోతోందని ప్రచారం జరిగింది.
అయితే రష్మిక ప్లేసు రాశీఖన్నాకు దక్కినట్టు తెలుస్తోంది. 1980 నాటి ప్రేమ కథగా వస్తున్న ఈ మూవీ సైనిక నేపథ్యంలో సాగుతుంది. దుల్కర్ ఓ లెఫ్ట్ నెంట్ ఆఫీసర్‌గా నటించబోతున్నాడు.కథలో హీరోయిన్స్ ఇద్దరికీ సమ ప్రాధాన్యం ఉన్న పాత్రలని తెలుస్తోంది. స్క్రిప్టు పనులన్నీ పూర్తయ్యాయి. 2021 జనవరిలో ఈ చిత్రం పట్టాలెక్కుతుంది. విశాల్ శేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.