రాశీఖన్నా…”ఊహలు గుసగుసలాడే” సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన అందాల రాశి. యువ హీరోల సరసన చక్కగా నటించి హిట్ హీరోయిన్ గా నిలిచింది. ఇటీవల ఓ సమావేశంలో పాల్గొన్న రాశీఖన్నా.. ‘ఐఎండీబీ’ ప్రచురించిన ఇండియన్ సెలబ్రిటీస్ పాపులర్ లిస్ట్ లో షారుఖ్‌ను వెనక్కు నెట్టి మొదటి స్థానం సొంతం చేసుకోవడంపై మాట్లాడింది.
‘నిజంగా ఈ విషయం తెలియగానే నేను చాలా సేపు నమ్మలేదు. నన్ను ఆటపట్టిస్తున్నారు అనుకున్నా. ‘ఐఎండీబీ’ గురించి మా నాన్నకు తెలియకపోయినా.. ‘నేను షారుఖ్ కంటే ముందున్నాను’ అని చెప్పగానే ఆయన షాక్ అయ్యారు.
తర్వాత నేను సంతోషించా. ఇలా జరగడం నా లైఫ్‌లో ఒక మైలురాయిగా భావిస్తా. షారుఖ్ కింగ్ ఖాన్. ఆయనను ఎవరూ ఏ విషయంలోనూ ఓడించలేరు. నేను ఆయనకంటే మొదటి ప్లేస్‌లో ఉన్నానంటే.. అది కేవలం నేను పోషించిన పాత్రకు దక్కిన ప్రేక్షకాదరణ మాత్రమే. ‘ఫర్జీ’ వెబ్ సిరీస్‌లో నా క్యారెక్టర్‌ను ప్రజలు అంతగా ఇష్టపడ్డారు. అంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది.