చలో సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టి తక్కువ టైం లోనే స్టార్ హీరోయిన్ గా దూసుకొచ్చిన బ్యూటీ రష్మిక మందన్న. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ స్టార్ హీరోతో వరుస సినిమాలను లైన్ లో పెడుతుంది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు వాయిదా పడటంతో ఇంటికే పరిమితమైన రష్మిక సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లో ఉంటుంది. తాజాగా రష్మిక ఓ ఫోటోను అభిమానులతో షేర్ చేసుకుంది. 2001 లో అంటే సరిగ్గా 20 ఏళ్ళ క్రితం గోకులం అనే మేగజైన్ కోసం ఇచ్చిన స్టిల్ ఇదంటూ రష్మిక ఒక ఫోటో ను పోస్ట్ చేసింది. ఆ ఫోటో చూసిన నెటిజన్లు హీరోయిన్ అయ్యాక కవర్ పేజ్ పై ఫోటోలు వస్తుంటాయి. కానీ రష్మిక చిన్నప్పుడే హీరోయిన్ అయిపోయిందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఇటీవల సరిలేరునీకెవ్వరు, భీష్మ సినిమాలతో హిట్ అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో వస్తున్న పుష్ప సినిమాలో నటిస్తుంది.