జబర్దస్త్ షో తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన యాంకర్ రష్మీ గౌతమ్. కెరీర్ మొదటి నుంచి క్యారెక్టర్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుని వచ్చిన రష్మీ ఇప్పుడు కాస్త కెరీర్ పై దృష్టి పెట్టింది. తనతో పాటు యాంకర్ గా ఉంటూ వెండితె పై తన నటనతో విమర్శకులను సైతం మెప్పించిన అనసూయ మంచి మార్కులు కొట్టేస్తుండటంతో రష్మీ కూడా నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలను చెయ్యాలని డిసైడ్ అయ్యిందట. గుంటూరు టాకీస్ సినిమాలో రెచ్చిపోయి మరీ అందాలు ఆరబోసిన రష్మీ ఆ తరువాత మరింత హాట్‌గా సినిమాల్లో కనిపించింది.
వెండితెరపై అందాలను ఆరబోస్తూ యూత్ ని ఆకట్టుకోగలుగుతుంది తప్ప నటన పరంగా ఆకట్టుకోలేకపోతుంది. రంగమ్మత్తగా అనసూయ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ జోష్ తో అనసూయకు వరుస అవకాశాలు వస్తున్నాయి. కానీ రష్మీకి మాత్రం సరైన అవకాశాలు రావట్లేదు. ప్రస్తుతం ఉన్న పోటీలో రష్మీ హీరోయిన్ గా నిలదొక్కుకోవాలంటే చాలా కష్టం. కాబట్టి నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చెయ్యాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది.