మంచి కిక్ ఇచ్చే కామెడీ షో జబర్ధస్త్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు అనటంలో సందేహం లేదు. అయితే… ఇప్పటికే అనసూయ, హైపర్ ఆదితో పాటు జబర్ధస్త్ జడ్జెస్ నాగబాబు, రోజాలు జబర్ధస్త్‌కు గుడ్‌బై చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో జబర్ధస్త్ కామెడీ షో ఫ్యూచర్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి.
అయితే, జబర్ధస్త్ షోకు ఇప్పుడు హోల్ అండ్ సోల్‌గా రష్మీ, సుధీర్‌లు నడిపించబోతున్నట్లు తెలుస్తోంది. బుల్లితెర మీద రష్మీ-సుధీర్ కాంబినేషన్‌కు ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. అందుకే జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్ధస్త్‌కు రష్మీనే మళ్లీ యాంకరింగ్ చేయబోతుండగా, సుధీర్ కూడా రెండు షోలలో అలరించబోతున్నట్లు తెలుస్తోంది.
7 సంవత్సరాలుగా విజయవంతంగా నడుస్తోన్న జబర్ధస్త్, ఈ క్రైసిస్ నుండి ఎలా భయటపడుతుందో… రష్మీ-సుధీర్ కాంబినేషన్ జబర్ధస్త్ ఫ్యూచర్‌ను డిసైడ్ చేయబోతుంది.
ఇక ఆది, అనసూయతో పాటు జబర్ధస్త్ జడ్జెస్ లోకల్‌గ్యాంగ్ అనే కొత్త షోకు మకాం మార్చినట్లు తెలుస్తోంది.