రష్మీ..జబర్ధస్త్ యాంకర్‌గా, అందాల ఆరబోత సినిమాలతో యువతకు ఆకట్టుకునే తార. ఇప్పుడు రష్మీ చేయబోతున్న ఓ సినిమాలో కూడా స్కిన్ షోనే ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో రష్మీ చేసిన గుంటూరు టాకీస్, అంతం సినిమాలో రష్మీ ఆన్ స్క్రీన్ రొమాన్స్ అంతా ఇంతా కాదు.
ఇప్పుడు రష్మీ కొత్త సినిమా కూడా అదే రేంజ్‌లో ఉండబోతుంది. అయితే… ఆ సినిమాలో హీరోగా శేఖర్ మాస్టర్ అని తెలుస్తోంది. సక్సెస్ ఫుల్ డాన్స్ మాస్టర్‌గా ఉన్న శేఖర్ మాస్టర్‌కు సినిమా ఆఫర్‌లు ఎప్పటి నుండో వస్తున్నా కాదంటూ వచ్చారట. కానీ ఇప్పుడు రష్మీతో సినమాకు ఓకే చెప్పారని ఇండస్ట్రీ టాక్. దాంతో… రష్మీ-శేఖర్ మాస్టర్‌లు మస్త్ రొమాన్స్ చేయనున్నారు అంటు కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే… అధికారికంగా వీరి సినిమాపై ప్రకటన రావాల్సి ఉంది.