రష్మిక మందన్న… ప్రస్తుతం సౌత్‌లో డిమాండ్ ఉన్న నటీమణులలో ఒకరు. అంతే కాదు బాలీవుడ్‌లో కూడా నటిస్తుంది. పుష్ప సినిమాతో ఇటీవల సూపర్ డూపర్ హిట్ ను అందుకున్న ఈ అమ్మడు బిజీ బిజీ గా గడుపుతుంది.
ఇకపోతే గతంలో కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం చేసుకున్న రష్మిక పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. ఆ తరువాత విజయ్ దేవరకొండతో ప్రేమాయణం నడుపుతుంది అంటూ కొన్ని వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే వాటిని ఆ ఇద్దరూ కొట్టిపారేశారు.
కాగా తాజాగా ప్రేమ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రష్మిక మందన్న. నా దృష్టిలో , ప్రేమ అనేది ఒకరికొకరు గౌరవించుకోటం, ఒకరికొకరు సమయం ఇవ్వడం తప్ప మరొకటి కాదు. ప్రేమను వర్ణించడం కష్టం. ఎందుకంటే ఇది భావాలకు సంబంధించినది. ప్రేమ అనేది సంబంధాలలో మాత్రమే పని చేస్తుందని తెలిపింది. ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి చాలా చిన్నదానిని. కాబట్టి నేను దాని గురించి ఆలోచించలేదు.
ఇక త్వరలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న పుష్ప పార్టు 2 లో నటించనుంది. అలాగే ఆమె నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్‌తో గుడ్‌బై, సిద్ధార్థ్ మల్హోత్రాతో మిషన్ మజ్ను సినిమాలు చేస్తుంది.