జబర్ధస్త్‌లోని తన నటన కంటే కూడా సుడిగాలి సుధీర్ తన వివాహంపై వచ్చే గాసిప్స్ తోనే ఎక్కువ వార్తల్లో నిలుస్తుంటాడు. జబర్దస్త్ టీమ్ అంతా కలిసి సుధీర్ వివాహం గురుంచి సెటైర్లు వేస్తూ కామెడీని పండిస్తోంది. సుధీర్ టీమ్ లోని గెటప్ శీను, ఆటో రామ్ ప్రసాద్ లు అయితే అతని మ్యారెజ్ పై ఓ రేంజ్ లో పంచులు విసురుతుంటారు. ఆ సమయంలో సుధీర్ అమాయకత్వానికి తోడు అతని ఎక్స్ప్రెషన్ ఎంతటి వారినైనా ఇట్టే నవ్విస్తుంటుంది. సుధీర్ బ్యాచిలర్ లైఫ్ కు ముగింపునిచ్చి ఓ ఇంటివాడిని చేసేందుకు గెటప్ శీను, ఆటో రామ్ ప్రసాద్ లు ప్రయత్నిస్తూనే ఉన్నామని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
అయితే జబర్దస్త్ యాంకర్ రష్మీకి అతనికి మధ్య ప్రేమాయణం నడుస్తోందని చాలా ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది. జబర్దస్త్ అభిమానులు కూడా ఇదే నిజమై సుధీర్ రష్మిని వివాహమాడితే చూడాలని… ఇద్దరి జోడీ బాగుంటుందని కామెంట్స్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే రష్మీ , సుడిగాలి సుధీర్ లు తమ మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని క్లారిటీ ఇచ్చినా… అభిమానులు ఎప్పటికప్పుడు మళ్ళీ ఇద్దరి మధ్య ఎదో నడుస్తోందని కామెంట్స్ చేస్తుంటారు.
Advertisements
సుడిగాలి సుధీర్ మ్యారెజ్ కు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చాడు ఆటో రామ్ ప్రసాద్. ఓ ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ.. సుడిగాలి సుధీర్ కోసం విదేశీ సంబంధాలను వెతుకుతున్నామని చెప్పాడు. అయితే రామ్ ప్రసాద్ సరదాగా ఇలా అన్నాడా లేక నిజంగానే సుధీర్ కోసం విదేశీ వనితను వెతుకుతున్నారా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ విదేశీ వనితను సుధీర్ చేసుకుంటే అతని ఫ్యాన్స్ నొచ్చుకునే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే అతని అభిమానులంతా సుధీర్ రష్మీ ఒకటవ్వాలని కోరుకుంటే ఎవరికీ తెలియని విదేశీ వనితను వివాహమాడితే నొచ్చుకోరు మరి.. కానీ సెలబ్రిటీల ఇష్టాలను కూడా అభిమానులు గౌరవించాలి కదా.