నేషనల్ క్రష్ రష్మిక మందాన్న తాజాగా నిద్ర గొప్పదనం గురించి చెప్పింది. ‘మామూలుగా అయితే ఇది నాకు నిద్రపోయే రోజు.. జీవితంలో నిద్ర అనేది చాలా ముఖ్యమైంది.. అందుకే జీవితంలో తగినంత నిద్రపోవాలి.. ఎవరి కోసమో దేని కోసమో కూడా నిద్రను త్యాగం చేయకండి.. నేను నా జీవితంలో నేర్చుకున్న పాఠం ఇదే.. నేను చెప్పాలనుకున్నది కూడా అదే.. హ్యాపీ స్లీప్ డే ఆల్’ అంటూ రష్మిక చెప్పుకొచ్చింది.
రష్మిక మందాన్న మామూలుగానే సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్‌కు గురవుతుంటుంది. ఆమె మాట్లాడే మాటలు, పోస్ట్ చేసే ఫోటోలు, ఈవెంట్లో ధరించే దుస్తులు ఎప్పుడూ నెగెటివ్ కామెంట్లకు గురవుతుంటుంది. అయితే రష్మిక మాత్రం ఈ నెగెటివిటీని ఎప్పుడూ కూడా అంతగా పట్టించుకోదు. కానీ ఇదే ట్రోలింగ్‌ను తన ఫ్యామిలీ మీద కూడా చేస్తున్నారని, అది తనకు నచ్చడం లేదని, బాధగా ఉందని చెప్పుకొచ్చింది.
రష్మిక మీద కన్నడ ప్రేక్షకులు ఎంతటి ఆగ్రహాన్ని పెంచుకున్నారో తెలిసిందే. కాంతారా సినిమా ఇష్యూ, రక్షిత్ శెట్టి విషయంలో రష్మిక ప్రవర్తించిన తీరు మీద కన్నడిగులు ఫైర్ అవుతున్నారు. కాంతారా సినిమా చూడలేదని చెప్పడం, ఆ తరువాత వివాదం చిలికి చిలికి గాలి వాన అవ్వడంతో.. సినిమాను చూశాను.. టీంకు మెసెజ్ పెట్టాను.. వారు కూడా థాంక్యూ అని రిప్లై ఇచ్చారంటూ రష్మిక బయటపెట్టేసింది.
రష్మికను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసిందనే రూమర్లు కూడా పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే తన మీద ఇంత వరకు అయితే బ్యాన్ లాంటిది ఎవ్వరూ పెట్టలేదని రష్మిక సెటైరికల్‌గా చెప్పేసింది. రష్మిక చేతిలో ఇప్పుడు ఒక్క కొత్త ప్రాజెక్ట్ కూడా లేదు. రష్మిక ప్రస్తుతం పుష్ప రెండో పార్ట్ షూటింగ్‌తో బిజీగా ఉంది. రష్మిక చేసిన హిందీ సినిమాలన్నీ బోల్తా కొట్టేస్తున్నాయి. కోలీవుడ్‌లో విజయ్‌తో చేసిన వారిసు సినిమా బ్లాక్ బస్టర్ అయింది. తెలుగులో ఆ సినిమా బెడిసి కొట్టేసింది. ఇక తెలుగులో ఆమె కొత్త సినిమాకు ఇంకా సైన్ చేసినట్టుగా కనిపించడం లేదు.