గీత గోవిందం సినిమాతో తెలుగులో టాప్ ప్లేస్ లో నిలిచిన హీరోయిన్ రష్మిక మందన్న. వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ కన్నడ బామ తెలుగు ఇండస్ట్రీకి రాకముందు కన్నడ యాక్టర్ రక్షిత్ శెట్టి తో ప్రేమలో పడింది. ఆ తరువాత ఈ జంట వివాహం కూడా చేసుకోవాలి అనుకున్నారు. అయితే 2017 నిశ్చితార్ధం జరిగాక పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఇదే విషయంపై మొన్న రక్షిత్ శెట్టి స్పందిస్తూ మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రష్మిక కూడా ఈ విషయంపై స్పందించారు.
తాము పెళ్లి చేసుకోవాలి అనుకున్న మాట వాస్తవం. కానీ సినిమాల్లో మంచి పేరు తెచ్చుకోవాలని పెళ్లిని రెండు సంవత్సరాలు వాయిదా వేసుకున్నాము. ఆ తరువాత అధికంగా సినిమా అవకాశాలు రావటంతో పెళ్లికి సమయం కేటాయించడం సాధ్యం కాలేదని తెలిపింది. పెళ్లి చేసుకుంటే నిర్మాతలను ఇబ్బంది పెట్టినట్టవుతుందని తను భావించానని చెప్పింది. ఈ కారణంగానే తమ పెళ్లిని రద్దు చేసుకున్నట్టు తెలిపింది.