టాలీవుడ్ హాట్ ఫేవరెట్ రష్మిక. ఇప్పుడీ స్టేట్ మెంట్ ను కాస్త మార్చాల్సి ఉంటుంది. ఆల్ ఇండియా హాట్ ఫేవరెట్ రష్మిక అని మార్చుకోవాల్సిందే. ఎందుకంటే, టాలీవుడ్, కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా ఆమె ఫేమస్ అయిపోయింది. ఈ బ్యూటీ ఎంతలా ఫేమస్ అయిందంటే, ఇప్పటికిప్పుడు కాల్షీట్ కావాలంటే మూడేళ్లు ఆగాల్సిన పరిస్థితి.
బాలీవుడ్ లో ఇలా అడుగుపెట్టిందో లేదో అలా ఆఫర్లు అందుకుంటోంది రష్మిక. మిషన్ మజ్నుతో హిందీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ, ఆ వెంటనే గుడ్ బై అనే సినిమాకు సైన్ చేసింది. ఈ రెండు సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. అంతలోనే మరో 2 సైన్ చేసింది.
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా స్టార్ట్ అయిన యానిమల్ సినిమాలో రష్మికను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక శషాంక్ కేతన్ దర్శకత్వంలో టైగర్ ష్రాప్ హీరోగా రాబోతున్న యాక్షన్ మూవీలో కూడా ఆమెనే. ఇలా హిందీలో 4 సినిమాలు చేస్తోంది ఈ బ్యూటీ.
ఇటు తెలుగులో పుష్ప-2 కోసం రెడీ అవుతోంది. ఆగస్ట్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది. అటు కోలీవుడ్ లో విజయ్ సరసన ఓ సినిమా చేస్తోంది. ఇలా వరుసగా, అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ. ఫ్రీ అవ్వాలంటే కనీసం మూడేళ్లు పడుతుంది. అటు పూజాహెగ్డే పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలే ఇప్పుడు హాట్ ఫేవరెట్స్ గా కొనసాగుతున్నారు.