అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తన నెక్ట్స్ మూవీతో రెడీ అవుతున్నాడు. బాలీవుడ్ లో ఇతడు చేస్తున్న రెండో సినిమా యానిమల్. ఇప్పుడీ సినిమాలో ఐటెంసాంగ్ కోసం రష్మికతో చర్చలు జరుపుతోంది యూనిట్. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక ఐటెంసాంగ్ చేస్తే రెండు ఉపయోగాలున్నాయి. రష్మిక ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో బిజీ అవుతోంది. ఇలాంటి అమ్మాయిని ఐటెంగా పెడితే కచ్చితంగా సినిమాకు మైలేజీ వస్తుంది. మరోవైపు రణబీర్ కపూర్ లాంటి హీరో సినిమాలో ఐటెంసాంగ్ ఆఫర్ ను వదులుకునేంత అమాయకురాలు కాదు రష్మిక.
అల్లు అర్జున్ ‘పుష్ప: ది రైజ్’లో ప్రేక్షకులను అలరించిన రష్మిక మందన్న ‘యానిమల్’లో ఓ ప్రత్యేక గీంతోల కనిపించనుందనే టాక్ ఇప్పటికే బాలీవుడ్ లో బాగా వ్యాపించింది. రష్మిక ఇప్పటివరకు ఐటెంసాంగ్ చేయలేదు. కాకపోతే సరిలేరు నీకెవ్వరు ఆమె చేసిన మైండ్ బ్లాక్ సాంగ్ అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. అదే ఈమెకు ఐటెంసాంగ్ ఆఫర్ తెచ్చిపెట్టినట్టుంది.
రష్మిక మందన్న తాజా చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఆ సినిమా పెద్ద ఫ్లాప్ అయింది. త్వరలోనే ఆమె పుష్ప సీక్వెల్ షూటింగ్ లో జాయిన్ అవ్వబోతోంది. ఇక ఆమె నటించిన బాలీవుడ్ చిత్రాలు 2 ఈ ఏడాది విడుదల కాబోతున్నాయి.