పుష్ప-2 సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. కానీ, ఇప్పటివరకు రష్మిక ఇంకా సెట్స్ పైకి రాలేదు. ఇదే అనుమానం చాలామందికి వచ్చింది. దీనిపై ఆరాలు తీస్తే అసలు విషయం తెలిసింది. పుష్ప-2లో రష్మికకు అంత సీన్ లేదంట. శ్రీవల్లి క్యారెక్టర్ లెంగ్త్ ను బాగా కట్ చేశారంట.
పుష్ప పార్ట్-1లో రష్మిక కీ రోల్ పోషించింది. పుష్పరాజ్ తో ప్రేమ, తన తండ్రిని పుష్పరాజ్ కాపాడడం, క్లైమాక్స్ లో పెళ్లి.. ఇలా రష్మిక చుట్టూ చాలా వ్యవహారమే నడిచింది. అయితే, పార్ట్-2 కథలో మాత్రం శ్రీవల్లి పాత్రకు అంత స్కోప్ ఇవ్వలేదని తెలుస్తోంది.
పార్ట్-1ను బన్నీ-ఫహాద్ ఫాజిల్ కాన్ ఫ్లిక్స్ తో ముగించారు. పార్ట్-2ను కంప్లీట్ గా వీళ్లిద్దరిపైనే ఫోకస్ చేస్తూ తెరకెక్కించారట. మరీ ముఖ్యంగా పోలీసాఫీసర్ ఫాజిల్ కు దొరకకుండా, బన్నీ చేసే స్మగ్లింగ్ తో పాటు.. కాస్త పొలిటికల్ టచ్ కూడా ఇచ్చారంట. ఆ సన్నివేశాలన్నీ బాగా రావడంతో, రష్మికను కేవలం సాంగ్స్ కు, మరికొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితం చేసినట్టు తెలుస్తోంది.
దీనిపై యూనిట్ నుంచి ఎలాంటి స్పందన లేదు. అటు రష్మిక మాత్రం పార్ట్-2లో కూడా తనది కీలక పాత్ర అంటోంది. ఈసారి తన రోల్ ఇంకాస్త ఎక్కువ యాక్టివ్ గా ఉంటుందని కూడా చెబుతోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది పుష్ప-2.