తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఉన్న రష్మీక మందన్న బాలీవుడ్ కు చెక్కేస్తోంది. మిషన్ మజ్ను సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న రష్మీక మందన్న ఇక మీదట పూర్తిస్థాయి ఫోకస్ చేయనుంది. అందులో భాగంగానే ముంబైలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
మొన్నటి వరకు షూటింగ్ కోసం ఎప్పుడొచ్చినా ముంబై హోటల్ రూంలో స్టే చేసేవారు. కానీ త్వరలోనే సొంత ఇంటికి మారనున్నారు. ఇటీవలే ఓ రేంజ్ రోవర్ కారు కొన్న ఈ బ్యూటీ ఇప్పుడు ముంబైలో సొంతింటికి మారనుందని బాలీవుడ్ వర్గాల టాక్.