టాలీవుడ్ అందాల తార, నేషనల్ క్రష్ రష్మిక వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల కాలంలో సీతారామం సినిమాతో మంచి విజయాన్ని అందుకకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్ లోకి గుడ్ బై అని చిత్రంతో అడుగుపెట్టబోతోంది.
ప్రముఖ నిర్మాత వికాస్ బహల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నీనా గుప్తాలు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో రష్మిక తార అనే పాత్రలో అలరించనుంది. ఈ చిత్రం థియేటర్లలోకి త్వరలో రానుంది.
మొదటిసారి బాలీవుడ్ లో నటించిన సినిమా విడుదల కానుండడంతో రష్మిక భావోద్వేగానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. అందుకు గాను తన ఫీలింగ్స్ ను పంచుకోవడానికి ఆమె బిగ్ బీ కి ఫోన్ చేసినట్లు ఇన్ స్టా గ్రామ్ లో తెలిపారు.
నేను చాలా నెర్వస్ గా ఉన్నానని ఆమె చెప్పినప్పుడు బిగ్ బి.. “ఎందుకు మీరు భయపడుతున్నారు? సినిమాలో అద్భుతంగా నటించారు. ఇటీవల, నేను ఒక ట్వీట్ చేసాను, ‘బెరుకుగా ఉండటం మానేయండి ఏమి జరుగుతుందనే దాని గురించి ఉత్సాహంగా ఉండటం ప్రారంభించండి.’ గుడ్‌బై చిత్రంలో తారగా మీ పాత్ర చాలా అందంగా ఉంది. సినిమాలో మీరు చాలా బాగా చేసారు. నిజాయితీగా చెప్పాలంటే, నేను మీ అభిమానిని అయ్యాను” అని అమితాబ్ బచ్చన్ రష్మికకు కాల్ ద్వారా చెప్పినట్లు ఆమె వివరించింది.
“కఠిన శ్రమకు ప్రత్యామ్నాయం లేదు. మీ కష్టాన్ని ప్రేక్షకులు చూస్తారనే నమ్మకం ఉంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమ నుండి మీరు చాలా ప్రేమ ప్రశంసలను అందుకుంటారని నేను విశ్వసిస్తున్నాను అంటూ బిగ్ బి ఆమెకు ధైర్యం చెప్పారు.
దీని గురించి అమితాబ్ ఇన్ స్టా పోస్ట్ ను పంచుకుంటూ… రష్మిక….“ఎల్లప్పుడూ నా గురువుగా, నా తండ్రిగా నాకు మీ నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. అంతేకాకుండా మార్గనిర్దేశం కూడా చేస్తుంది. తారా తో పాటు తన పాపాను మీ కుటుంబంతో కలిసి మీకు సమీపంలోని సినిమాల్లో చూడండి. అక్టోబరు 7న మీ టిక్కెట్‌లను కేవలం రూ. 150/-తో బుక్ చేసుకోండి #గుడ్‌బై”
ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం రష్మిక బాగా కష్టపడినట్లు తెలుస్తోంది. రష్మిక తర్వాత నటుడు రణబీర్ కపూర్‌తో కలిసి యానిమల్ అనే బాలీవుడ్ చిత్రంలో కనిపించనుంది.