నితిన్ తన ప్రేయసి శాలినితో కలిసి పెళ్లిపీటలెక్కబోతున్నాడు. చాలాకాలం పాటు కొనసాగిన వీరి ప్రేమ వ్యవహారానికి పెళ్లితో అందమైన ముగింపు పలకబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే అందాల భామ రష్మిక నితిన్ కు శుభాకాంక్షలు చెప్తూ ఓ ట్వీట్ చేసింది. కంగ్రాచ్యులేషన్ నితిన్ సార్.. నేను మీకు ఎంత అదృష్టం తీసుకువచ్చానో! మీరు నాతో నటిస్తున్నారో లేదో ఇలా ఓ ఇంటివారు కాబోతున్నారు అంటూ రష్మిక సరదాగా ట్వీట్ చేసింది. మీరు ఇద్దరు ఒక్కటి అవుతుండటం చాలా సంతోషంగా ఉందంటూ రష్మిక పేర్కొంది.
నితిన్ సరసన భీష్మ సినిమాలో రష్మిక నటిస్తుంది. ఈ సినిమా ఈనెల 21న ప్రేక్షకులు ముందుకు రానున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి నటిస్తుండటంతోనే నితిన్ కు ఈ అదృష్టం దక్కిందంటూ రష్మిక సరదాగా చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. శుక్రవారం శాలినితో నితిన్ ఎంగేజ్ మెంట్ అయిన విషయం తెలిసిందే. ఏప్రిల్ లో వీరి వివాహం జరగనుంది.