చలో సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టి హిట్ మీద హిట్ కొడుతూ… వరుస అవకాశాలతో దూసుకుపోతున్న అమ్మడు రష్మిక మందన్న. గీత గోవిందం సినిమాలో గీత క్యారెక్టర్ తో ఫామిలీ ఆడియోన్స్ కు మరింత చేరువైంది. ప్రస్తుతం ఈ అమ్మడు మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా వస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తుంది. ఎప్పుడు సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంటూ సినిమా షూటింగ్ కు సంబందించిన విషయాలను నెటిజన్లతో పంచుకునే రష్మిక అప్పుడప్పుడు కొత్త కొత్త ఫొటోస్ ని పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా రష్మిక కొన్ని ఫొటోస్ పోస్ట్ చేసింది. డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ రష్మిక పెట్టిన ఫోటోలు ఫాన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి.