మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రంగా ఆచార్య సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా సామజిక కథ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో చిరంజీవి దేవాదయ శాఖ ఆఫీసర్ గా సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మరో కీలక పాత్రలో రామ్ చరణ్ నటిస్తారని మొదట ప్రచారం జరిగింది. కాని రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటంవలన ఆయన ప్లేసులో మహేష్ ను తీసుకుంటారని వార్తలు వెలువడ్డాయి. ఇక, మహేష్ బాబు కొన్ని కారణాల వలన ఈ చిత్రం నుంచి తప్పుకోవడంతో మళ్ళీ ఈ పాత్రలో రామ్ చరణ్ నటిస్తారని తెలుస్తోంది. చిరంజీవి సరసన అందాల చందమామ కాజల్ నటించనుండగా.. రామ్ చరణ్ కు జోడీగా కీయరా అద్వానీ నటిస్తారని ప్రచారం జరిగింది.
రామ్‌చరణ్‌తో కియరా అద్వానీని నటింప చేయాలని డైరెక్టర్ కొరటాల శివ అనుకున్నప్పటికీ కుదరలేదట.దాంతో రామ్ చరణ్ సరసన టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా కొనసాగుతోన్న రష్మిక మందన నటించనున్నట్లు సినీ వర్గాల సమచారం. ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీ,బిజీగా గడుపుతోన్న రష్మిక ఈ సినిమాలో నటించేందుకు ఓకె చెప్తుందా..?లేదా అన్నది సందేహంగా మారింది. ఈ సినిమాను ఆగస్ట్ లో విడుదలని చేయాలని ముందుగా అనుకున్న ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఈ సినిమా రిలీజ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కరోనా ప్రభావంతో సినిమా షూటింగ్ వాయిదా పడటంతో ఆచార్య సినిమా విడుదల మరింత ఆలస్యం కానుంది.