సరిలేరు నీకెవ్వరు, భీష్మ విజయాలతో టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఎదిగిన కన్నడ భామ రష్మికా మందన్న. ప్రస్తుతం పలు తెలుగు సినిమాలతో పాటు తమిళ్ లో ఎక్కువ సినిమాలు చేస్తుండగా, వరుసగా బాలీవుడ్ లోనూ ఆఫర్స్ వస్తున్నాయి. దీంతో ఈ చార్మింగ్ గర్ల్ సెలెక్టివ్ గా సినిమాలకు సైన్ చేస్తుంది.
ఆర్.ఆర్.ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో రష్మికను హీరోయిన్ గా సంప్రదించగా నో చెప్పినట్లు తెలుస్తోంది. డేట్స్ అడ్జెస్ట్ కావని, తను చేయలేనంటూ రష్మీక మరో ఆలోచన లేకుండా చెప్పేయటం చర్చనీయాంశంగా మారింది.
బాలీవుడ్ ఆఫర్స్ వస్తున్న నేపథ్యంలో డేట్స్ క్లోజ్ చేసుకోవటం ఇష్టంలేకే రష్మీక ఇలా నో చెప్పిందా అన్న సందేహం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.