సోషల్ మీడియాలో సెలెబ్రిటీల గురించి వచ్చే వార్తలు వినడానికి బాగుంటాయి కానీ చాలా సార్లు అవి పర్సనల్ కామెంట్స్ గా మారి బాధ పెడుతుంటాయి. సౌత్ లో స్టార్ స్టేటస్ అందుకుంటున్న యంగ్ బ్యూటీ రష్మీక మందన్న కూడా ఇలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేసింది.
ఆమె చిన్నప్పటి ఫోటోని యూజ్ చేస్తూ ఒక మేమి క్రియేట్ చేశారు, అందులో ఈ పాపా పెద్దయ్యాక ఇంటర్నేషనల్ దగర్ అవుతుందని ఎవరైనా ఊహించారా అని ట్రోల్ చేశారు. కన్నడలో దగర్ అంటే ప్రాస్టిట్యూట్ అని అర్థం.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే రష్మీక, ఈ మేమి చూసి “ఎవరు ఏ పని చేసినా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఏ యాక్టర్ ఇలాంటి మాటలని యాక్సెప్ట్ చేయలేరు. పర్సనల్ టార్గెట్స్ చేయకండి” అంటూ రెస్పాండ్ అయ్యింది. చివరగా ఈ మేమి చేసింది ఎవరో కానీ కంగ్రాట్స్ మీరు నన్ను బాధ పెట్టారు అని రష్మీక పోస్ట్ చేసింది.
ట్రోలింగ్ ఆర్ కామెంటింగ్ అనేది ఫ్రెండ్లీగా ఉండాలి కానీ ఇలా పర్సనల్ అభ్యుజింగ్ చేయడం ఖచ్చితంగా తప్పు. ఇది అర్థం చేసుకోని ఇప్పటికైనా సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడుకుంటే బాగుంటుంది.