అక్కినేని హీరోతో రష్మిక మందన్న జతకట్టనుంది. కొత్త దర్శకుడు శశి, నాగ చైతన్య హీరోగా ఓ సినిమా తియ్యబోతున్నాడు. ఆ సినిమా లో రశ్మికనే హీరోయిన్ గా పెట్టాలనుకుంటున్నారని ఫిలింనగర్ నగర్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా పై త్వరలోనే పూర్తిగా వివరాలు వెలువడే అవకాశం ఉంది.
ఇప్పటికే రష్మిక వరుస సినిమాలతో దూసుకుపోతుంది. గీత గోవిందం సినిమాతో తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న రష్మిక చెలరేగిపోతుంది. సరిలేరు నీకెవ్వరూ సినిమాలో మహేష్ సరసన నటిస్తుండగా, నితిన్ బీష్మ సినిమాలో కూడా నటిస్తుంది. మరో వైపు అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న కొత్త సినిమా లో రష్మికనే హీరోయిన్ గా ఎంపిక చేశారని సమాచారం.