గీత గోవిందం సినిమాతో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు పరశురామ్. గీత గోవిందం సినిమా తరువాత ఒక్క సినిమా కూడా చెయ్యలేదు ఈ దర్శకుడు. చాలా గ్యాప్ తరువాత ఓ కథను చైతూకు వినిపించాడు పరశురామ్. చైతు కూడా కథకు ఒకే చెప్పటంతో త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమాలో రష్మిక మందన్నాను హీరోయిన్ గా తీసుకోనున్నారని సమాచారం. గీత గోవిందం సినిమాలో రష్మిక మందన్న నటన విమర్శకులను సైతం మెప్పించగలిగింది. ఆమె నటనకు ఫిదా అయిన పరశురామ్ మళ్లీ రశ్మికకు మళ్లీ అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాడట.
మరి నాగ చైతన్య, రష్మిక జోడి ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. ప్రస్తుతం నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తవ్వగానే పరశురామ్ తో సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది.