ఈ యేడాది ఆరంభంలో సరిలేరు నీకెవ్వరు సినిమాతో హిట్ కొట్టింది కన్నడ బ్యూటీ రష్మిక మందన్న. ఆ తరువాత నితిన్ హీరోగా వచ్చిన భీష్మ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో తన సినిమాలకు సంబంధించిన విషయాలను, ఫన్నీ వీడియో లను షేర్ చేస్తూ ఉండే రష్మిక తాజాగా ఓ వీడియోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
ఆ వీడియోలో రస్మిక తుంబుర తిప్పుతూ ఉంటుంది. ఆ వీడియోను పోస్ట్ చేసి ఈ వీడియో ఎవరికైనా గుర్తుందా అంటూ ప్రశ్నించింది. నేను ఏ సాంప్రదాయాన్ని, దేవతలను అగౌరపరచడం లేదు. ఈ వీడియోను దయచేసి ఆ కోణంలో చూడకండి ఇది ఓ సినిమాలోని ఫన్నీ సీన్ అంటూ చెప్పుకొచ్చింది.
https://www.instagram.com/reel/CI53qN-Jjqk/?igshid=1gbm06bct1jnw