2020 ఆరంభంలో సరిలేరు నీకెవ్వరు, భీష్మ చిత్రాలతో మంచి హిట్ ను అందుకుంది రష్మిక మందన్న. ఈ రెండు హిట్ లతో స్టార్ హీరోయిన్ గా అయిపోయింది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రష్మిక మందన్న ను పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్.
ఇప్పటికే రష్మిక కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మార్చిలో సెట్స్ పైకి ఈ సినిమాను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. కాగా అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ పాటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఆర్ఆర్ఆర్ లేట్ అవ్వటం తో ఈ సినిమా షూటింగ్ కూడా ఆలస్యమైంది.