స్టార్ హీరోయిన్ రష్మిక చిన్న వయస్సులోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోవడంతో పాటు.. వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తోంది. రష్మిక నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నప్పటికీ.. తన కెరీర్ పై ఆ ప్రభావం ఏ మాత్రం పడకుండా జాగ్రత్త పడుతూ వస్తోంది ఈ అమ్మడు.
తాజాగా.. కరణ్ జోహార్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కొంతమందికి మాత్రమే ఆహ్వానం అందింది. వారిలో రష్మిక మందన్న కూడా ఉండటంతో తాను ఆ వేడుకకు హాజరైంది. వేడుకలో ఆమె వేసుకున్న డ్రెస్ తో తీవ్ర ఇబ్బందులు పడింది. డ్రెస్ కాళ్ల కిందివరకు ఆనుతుండగా.. నడిచే సమయంలో రష్మిక పదేపదే డ్రెస్ ను సర్దుతూ కనిపించారు.
అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమె డ్రెస్ పైన నెటిజన్లు తీవ్రస్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు. రష్మిక డ్రెస్ విషయంలో ఇలాంటి తప్పులు చేయడం ఏమిటని కామెంట్లు పెడుతున్నారు.
రష్మిక డ్రెస్ గురించి ఎక్కువమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. రష్మిక ఫోటోల ద్వారా తనకు డ్రెస్ అంత కంఫర్ట్ గా లేదని చెప్పకనే చెప్పారు. సినిమాల ద్వారా మంచిపేరును సొంతం చేసుకున్న రష్మిక ఇలాంటి చిన్నచిన్న విషయాల ద్వారా విమర్శలపాలవుతున్నారంటున్నారు అభిమానులు.