హర్ష కొనగంటి దర్శకత్వంలో ఆశిష్ రెడ్డి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రౌడీ బాయ్స్. ఆశిష్ రెడ్డి ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, ట్రైలర్ అన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
అయితే ఈ సినిమా ట్రైలర్ పై హీరోయిన్ రష్మిక మందన్న స్పందించారు. ట్రైలర్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉందని అంతేకాక సినిమా లో నటించిన హీరో హీరోయిన్ లకు, నిర్మాతలకు, దర్శకుడు కి, చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.