రష్మిక.. ఇప్పుడు నేషనల్ హీరోయిన్. హిందీలో వరుసపెట్టి సినిమాలు చేస్తోంది. తెలుగులో ఆమె కాల్షీట్ల కోసం వెయిటింగ్. తమిళ్ లో స్టార్ హీరోల సరసన నటిస్తోంది. ఇలాంటి బ్యూటీని ఇప్పుడో ప్రాజెక్టు కోసం లాక్కొచ్చారు. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే నాగచైతన్య సరసన మెరవనుంది ఈ బ్యూటీ.
త్వరలోనే పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు నాగచైతన్య. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికను తీసుకోవాలనుకుంటున్నారు. ఆమెను సంప్రదించి పైపైన స్టోరీలైన్ కూడా చెప్పాడట పరశురామ్. రష్మిక వెంటనే నటించడానికి అంగీకరించిందట.
నిజానికి ఇప్పుడున్న పొజిషన్ లో రష్మిక ఈ సినిమా చేయాల్సిన అవసరం లేదు. ఆ కాల్షీట్లను మరో పెద్ద హీరోకు కేటాయించొచ్చు. కానీ.. కేవలం పరశురామ్ కోసం ఈ సినిమా చేయడానికి ఒప్పుకుందంట రష్మిక. ఈ బ్యూటీకి బ్రేక్ ఇచ్చిన వ్యక్తి పరశురామ్. ఇతడు డైరక్ట్ చేసిన గీతగోవిందం సినిమాతోనే రష్మిక లైఫ్ మారిపోయింది. అంతకంటే ముందు ఛలో సినిమాతో ఆమె హిట్ కొట్టినప్పటికీ, స్టార్ డమ్ తెచ్చిపెట్టింది మాత్రం గీతగోవిందం సినిమానే.
అన్నట్టు ఈ సినిమాకు ఇంకా పూర్తి కథ సిద్ధం కాలేదు. స్టోరీలైన్ మాత్రం ఉంది. ఆ లైన్ చుట్టూ పక్కా స్క్రీన్ ప్లే రాసే పనిలో పరశురామ్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు గోపీసుందర్ ను మ్యూజిక్ డైరక్టర్ గా అనుకుంటున్నారు. 14 రీల్స్ బ్యానర్ పై రాబోతోంది ఈ సినిమా.