బాలీవుడ్ లో మరో బంపరాఫర్ అందుకుంది రష్మిక. ఈసారి ఏకంగా రణబీర్ కపూర్ సరసన నటించే అవకాశం అందుకుంది. రణబీర్ ది లక్కీ హ్యాండ్ అనే పేరుంది. అతడి సినిమాలో ఎవరైనా హీరోయిన్ గా నటిస్తే, ఆమెకు క్రేజ్ గ్యారెంటీ. ఇప్పుడీ గోల్డెన్ హ్యాండ్ ను రష్మిక కూడా అందుకోబోతోందంటూ ప్రచారం మొదలైంది.
అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు రణబీర్ కపూర్. ఈ సినిమా పేరు యానిమల్. ఇఁదులో హీరోయిన్ గా పరిణీతి చోప్రాను తీసుకున్నారు. అంతా సెట్ అనుకున్న టైమ్ కు ఈ ప్రాజెక్ట్ నుంచి పరిణీతిని తప్పించారు. లేదు, పరిణీతినే తప్పుకుందని కొందరు అంటారు.
కారణాలు ఏమైనా, పరిణీతి తప్పుకుంది. ఇప్పుడా స్థానంలోకి రష్మిక వచ్చి చేరింది. బాలీవుడ్ లో ఈమెకిది మూడో సినిమా. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ గుడ్ బై, మిషన్ మజ్ను అనే సినిమాలు చేస్తోంది. ఈ రెండు సినిమాల షూటింగ్స్ దాదాపు పూర్తయ్యాయి. అటు రణబీర్ కూడా బ్రహ్మాస్త్ర షూట్ కంప్లీట్ చేశాడు. ఇటు సందీప్ రెడ్డి కూడా బౌండెడ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నాడు. సో.. వీలైనంత త్వరగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది.
తెలుగులో పుష్ప-2 సినిమాకు కాల్షీట్లు కేటాయించింది రష్మిక. ఇప్పుడు బాలీవుడ్ ప్రాజెక్టుకు కమిట్ అవ్వడంతో, ఆమె మరో తెలుగు సినిమాకు కాల్షీట్లు ఇవ్వకపోవచ్చు. రష్మిక నటించిన ఏదో ఒక సినిమా బాలీవుడ్ లో రిలీజై, ఆ రిజల్ట్ బయటకొచ్చిన తర్వాత ఆమె దారి ఎటువైపు అనేది తెలుస్తుంది.