తనపై జరుగుతున్న ట్రోలింగ్ పై తొలిసారి స్పందించింది హీరోయిన్ రష్మిక. చాలామంది తనను తిడుతుంటే చాలా బాధగా ఉందంటోంది. అకారణంగా తనను నిందించడం వల్లనే బాధ కలుగుతోందని చెప్పుకొచ్చింది.
“నాపై ఎందుకు ఇంత ద్వేషం చూపిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. బాగా వర్కవుట్ చేస్తే మగాడిలా ఉన్నానని అంటున్నారు. జిమ్ తగ్గిస్తే లావెక్కుతున్నానని అంటారు. ఏదైనా అంశంపై ఓపెన్ గా మాట్లాడితే పొగరు అంటున్నారు. మౌనంగా ఉంటే హీరోయిన్ ప్రవర్తించాల్సిన విధానం ఇది కాదంటున్నారు. ఇలా ప్రతి విషయానికీ నన్ను కార్నర్ చేస్తున్నారు. నేను చేసిన తప్పేంటో నాకు అర్థం కావడం లేదు.”
ఇలా తన బాధను వ్యక్తం చేసింది రష్మిక. ఈమధ్య కాంతార వివాదం ఆమెను చుట్టుకుంది. ఆ తర్వాత రొమాంటిక్ సాంగ్స్ నార్త్ లోనే ఎక్కువగా వస్తాయంటూ మరో వివాదాస్పద వ్యాఖ్య చేసింది. ఈ వివాదాల నేపథ్యంలో చాలా ట్రోలింగ్ ఎదుర్కొంది రష్మిక.
ప్రస్తుతం ఈ బ్యూటీ పుష్ప-2 మూవీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తోంది. వచ్చేనెల నుంచి ఆ సినిమా సెట్స్ లో జాయిన్ అవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వైజాగ్ లో జరుగుతోంది. బన్నీపై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.