సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రోల్ కు గురవుతుంటుంది రష్మిక. వేసుకునే దుస్తుల నుంచి చేసే వ్యాఖ్యల వరకు ప్రతి అంశంపై రష్మికను ఎవరో ఒకరు ట్రోల్ చేస్తూనే ఉంటారు. మరి ఈ ట్రోలింగ్స్ ను ఆమె ఎలా ఎదుర్కొంటుంది. అంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతోంది. దీనికి ఓ పాటతో చక్కగా సమాధానం ఇచ్చింది రష్మిక.
సోషల్ మీడియాలో రష్మికకు ఇదే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె అందంగా సమాధానమిచ్చింది. మైండ్ మై బిజినెస్ అనే పాటకు చక్కగా డాన్స్ చేస్తూ వీడియో రిలీజ్ చేసింది. చేతిలో మంచి నీళ్ల గ్లాస్ పట్టుకొని, చిన్న నిక్కరు వేసుకొని రష్మిక వేసిన చిన్న చిన్న స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆమె డాన్స్, దుస్తుల సంగతి పక్కనపెడితే.. ఆమె సమాధానం ఇచ్చిన తీరు మాత్రం అమోఘంగా ఉంది. ట్రోలింగ్ ఎంతైనా చేసుకోండి.. నా పని నేను చేసుకుపోతా, అలాంటివేం పట్టించుకోను, సంతోషంగా ఉంటాను, అనే అర్థం వచ్చేలా రష్మిక పెట్టిన ఈ సాంగ్ అందర్నీ ఎంతగానే ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమా చేస్తోంది. శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమా మార్చి 4న విడుదలకు సిద్ధమౌతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రచారంలో ఆమె భాగం కానుంది.