తన సినిమాలపై, వ్యక్తిగత విషయాలపై రష్మిక స్పందించడం కామన్. అయితే.. తొలిసారిగా ఆమె కుక్కపై స్పందించింది. దీనికి కారణం ఆమె శునకానికి సంబంధించి కొన్ని వెబ్ సైట్లలో వచ్చిన వార్తలే. అవేంటంటే.. రష్మిక, తనతో పాటు తన కుక్క పిల్లకు కూడా ఫ్లైట్ టికెట్ కావాలని నిర్మాతల్ని డిమాండ్ చేస్తోందట. అది లేకపోతే షూటింగ్స్ చేయనని మారాం చేస్తోందట. దీంతో సదరు పెట్ డాగ్ కు కూడా టికెట్ తీయాల్సిన పరిస్థితి నిర్మాతకు ఏర్పడిందనేది ఆ కథనం. దీనిపై రష్మిక కాస్త ఘాటుగా, సెటైరిక్ గా స్పందించింది.
తన కుక్కపిల్లతో పాటు ఆ స్టోరీ రాసిన రైటర్ కూడా తనతో ప్రయాణం చేస్తే బాగుండేదని రష్మిక అభిప్రాయపడింది. తన వెంట పెంపుడు కుక్క లేదని, కనీసం ఆ కథనం రాసిన రచయిత ఉంటే తన వెంట తీసుకెళ్లేదాన్నని పరోక్షంగా చురకలు అంటించింది.
ఇక తన పెంపుడు కుక్కపై స్పందిస్తూ.. హైదరాబాద్ లో క్షేమంగా ఉందని, తనకు ప్రయాణాలంటే ఇష్టం ఉండదని రష్మిక స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ విజయ్-వంశీ పైడిపల్లి సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు వారసుడు అనే టైటిల్ పెట్టారు.
ఈ మూవీ షూట్ ముగిసిన వెంటనే, హిందీలో మరో ప్రాజెక్టు స్టార్ట్ చేయబోతోంది రష్మిక. దాంతో సమాంతరంగా పుష్ప-2 కూడా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.