పుష్ప సినిమా హిట్టయింది. ఇంతవరకు ఓకే. కానీ ఆ సినిమా అందరికీ నచ్చలేదు. చాలామంది కంటెంట్ పై పెదవి విరిచారు. కొన్ని సన్నివేశాలు, కొంత స్క్రీన్ ప్లే మరో విధంగా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ పై విమర్శలు ఎక్కువగా చెలరేగాయి. ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటికే సుకుమార్ రియాక్ట్ అయ్యాడు. ఇప్పుడు రష్మిక వంతు.
పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటించి మెప్పించిన రష్మిక.. పుష్ప-2లో తన పాత్ర చాలా బాగుంటుందని చెప్పుకొచ్చింది. దీంతో పాటు ఓవరాల్ గా పార్ట్-2 నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందంటోంది. పుష్ప ది-రైజ్ తో పోలిస్తే, పుష్ప పార్ట్-2 మరింత పెద్దగా, ఇంకా బెటర్ గా ఉంటుందని చెబుతోంది రష్మిక.
శేషాచలం అడవుల బ్యాక్ డ్రాప్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది పుష్ప సినిమా. ఆంధ్రలో లాభాలు రాబట్టలేకపోయిన ఈ సినిమా, ఆ నష్టాల్ని ఉత్తరాదిన కవర్ చేసుకుంది. నార్త్ లో ఈ సినిమా పెద్ద హిట్టయింది.
అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈపాటికి పుష్ప పార్ట్-2 సెట్స్ పైకి రావాలి. కానీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, సినిమా షూటింగ్ ను పోస్ట్ పోన్ చేసుకున్నారు. పార్ట్-2కు సంబంధించి బౌండెడ్ స్క్రిప్ట్ రెడీగా ఉంది.