యువర్ లైఫ్ అంటూ ఉపాసన కొణిదెల ఓ వెబ్ సైట్ ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆరోగ్యం, ఫిట్నెస్ వంటి ప్రధాన అంశాలతో ఉపాసన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇటీవల సమంత ఫిట్నెస్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆరోగ్య అలవాట్ల గురించి కొన్ని విషయాలను పంచుకున్నారు.
ఇక తాజాగా యువర్ లైఫ్ లో భాగస్వామ్యం అయ్యారు రష్మీక మందన్న. చికెన్ తో కోలీపుట్టు కూర వండి ఉపాసన కు రుచి చూపించారు. అయితే రస్మిక వంటకానికి ఉపాసన వంద మార్కులు వేశారు. ఈ యువ నటి సినీ ఇండస్ట్రీలో తప్పకుండా మంచి సక్సెస్ ను సాధిస్తుంది. ఒకవేళ ఎవరైనా ఆమె కు అవకాశం ఇస్తే సూపర్ గా వంట చేస్తుంది అంటూ ప్రశంసలు కురిపించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.