వీళ్లిద్దరి మధ్య వస్తున్న పుకార్లు ఇప్పటివి కాదు. వీళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ కొన్నేళ్లుగా పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇద్దరూ కలిసి పార్టీలకు అటెండ్ అవుతారు, ముంబయిలోని రెస్టారెంట్లలో కనిపిస్తారు. రష్మిక అయితే కొన్నిసార్లు హోటల్స్ కు వెళ్లకుండా, నేరుగా విజయ్ దేవరకొండ ఇంటికి కూడా వెళ్తుంది.
ఓవైపు ఇంత జరుగుతుంటే, వీళ్లిద్దరు మాత్రం తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని మాత్రమే చెబుతారు. రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ రష్మిక మరోసారి ఇదే కథ వినిపించింది. విజయ్ తో తన స్నేహబంధం కొనసాగుతుందని, తమ బాండింగ్ చాలా ఉన్నతమైనదని చెప్పుకొచ్చింది.
కట్ చేస్తే, ఈరోజు విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి మాల్దీవుల్లో ల్యాండ్ అయ్యారు. ఈ మేరకు బాలీవుడ్ మీడియాలో వరుసపెట్టి కథనాలు వినిపిస్తున్నాయి. డేటింగ్ లో లేనప్పుడు మాల్దీవులకు వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. అయితే ఈ కపుల్ మాత్రం ఎప్పట్లానే ఫ్రెండ్ షిప్ అంటూ కవర్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.
బాలీవుడ్ కు కూడా ఈ హీరోహీరోయిన్లు పరిచయం. రష్మిక చేసిన తొలి హిందీ సినిమా గుడ్ బై రిలీజైంది. అటు విజయ్ దేవరకొండ లైగర్, అర్జున్ రెడ్డి సినిమాలతో బాలీవుడ్ లో ఫేమస్ అయ్యాడు. దీంతో వీళ్లిద్దరిపై బాలీవుడ్ మీడియాలో లెక్కలేనన్ని గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి.