రాష్ట్రపతి భవన్ వీక్షించేందుకు సందర్శకులకు నేటి నుంచి అనుమతి ఇచ్చారు. నేటి నుంచి ఈ నెల 15 వరకు ప్రజల సందర్శనార్థం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రపతి భవన్‌ను తెరచి ఉంచనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో నేటి నుంచి సందర్శకుల తాకిడి మొదలైంది. మొదటి రోజు నగరవాసులు, విద్యార్థులు వచ్చి రాష్ట్రపతి భవన్ అందాలను తిలకించారు. రాష్ట్రపతి భవన్, రాక్ గార్డెన్, ఫౌంటెన్, ఫ్లవర్ గార్డెన్ ప్రత్యేక ఆకర్షణగా వున్నాయి. స్వతంత్ర అనంతరం రాష్ట్రపతి నిలయాన్ని హైదరాబాద్ నిజాం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దాన్ని సెక్రటేరియట్‌కు అప్పగించారు.
అప్పటి నుంచి ప్రతి ఏడాది జనవరి మొదటి వారంలో రాష్ట్రపతి భవనాన్ని సందర్శించేందకు ప్రజలకు అనుమతి ఇస్తున్నారు. రాష్ట్రపతి భవన్‌లోని ప్రధాన భవనాన్ని కూడా పౌరులు సందర్శించవచ్చు. ప్రతి ఏడాది శీతాకాల సమయంలో రాష్ట్రపతి ఈ భవనానికి వస్తారు.
ఈ భవనాన్ని 1860లో నిర్మించారు. ఇందులో మొత్తం మొత్తం 16 గదులు ఉన్నాయి. రాష్ట్రపతి శీతాకాల పర్యటనకు వచ్చిన సమయంలో ఈ భవనానికి వస్తారు. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో తోటలు, మూలికల మొక్కలు, వివిధ రకాల తోటలను ఏర్పాటు చేశారు. ఇక్కడ హెర్బల్ గార్డెన్ 7,000 చదరపు మీటర్లలో విస్తరించి ఉంది.