హైదరాబాద్ రసూల్ పురా జంక్షన్ దగ్గర నాలా వెడల్పు పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దాదాపు 45 రోజుల పాటు ఆంక్షలు కొనసాగనున్నాయి.
ఈ క్రమంలో బేగంపేట్ ట్రాఫిక్ డైవర్షన్ రూట్‌ని ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ రంగనాథ్‌తో కలిసి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పరిశీలించారు. ముందుగా నాలా మరమ్మత్తుల పనులను పర్యవేక్షించి.. అక్కడ అమలు అవుతున్న ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్ళింపులను పరిశీలించారు. అనంతరం పలు సూచనలు చేశారు.
జూన్ 4వ తేదీ వరకు బేగంపేట్ రసూల్ పుర వరకు ఆంక్షలు కొనసాగిస్తామన్నారు సీపీ ఆనంద్. రసూల్‌పురా నాలా మరమ్మతుల కారణంగా.. అమలవుతున్న ఆంక్షలు ట్రాఫిక్ నియంత్రణ పై తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై ట్రాఫిక్ పోలీసులతో చర్చించారు. ట్రాఫిక్ ఆంక్షలు ఉండడంతో వాహనదారులు సహకరించాలని కోరారు నగర సీపీ సీవీ ఆనంద్.
సీటీవో నుంచి వచ్చే వాహనాలను హనుమాన్‌దేవాలయం మీదుగా మళ్ళిస్తామన్నారు. బేగంపేట నుంచి వాహనాలను రసూల్‌పురా నుంచి కిమ్స్ వైపుగా మళ్లించనున్నారు. లారీలు, బస్సుల్లాంటి పెద్ద వాహనాలకు ఎంట్రీ బంద్ చేశారు.