వయసు మీద పడుతున్నా… వ్యాపారంపై ఇప్పటికి పట్టు సడలని పారిశ్రామికవేత్త ఎవరంటే.. ఎవరికైనా ఠక్కున గుర్తొచ్చే పేరు రతన్ టాటా సన్స్ కంపెనీ ఛైర్మన్ రతన్ టాటా. మామూలుగా సోషల్ మీడియాలో అంత పెద్దగా యాక్టివ్‌గా ఉండని ఆయన తాజాగా చేసిన ఓ ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
అమెరికా గప్లిన్‌లో జాగ్వార్ షోరూమ్ ను సందర్శించిన ఆయన.. అదే సమయంలో అక్కడ జరిగిన ఓ సంఘటన తాలూకు ఫోటోను పంచుకున్నారు. రతన్ టాటా షోరూం సందర్శించేందుకు వెళ్లిన సమయంలోనే.. ఫేమస్ రాక్‌బ్యాండ్ బృందమైన రోజెస్ బ్యాంక్‌కి చెందిన స్లాష్ అక్కడ కనిపించారు.
దీంతో రతన్ టాటా, స్లాష్‌తో కలిసి ఓ ఫోటో దిగి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ అలాగే ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు స్పందిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ రణవీర్ సింగ్ టూ కూల్ అంటూ కామెంట్ చేశారు.
The Day I visited Galpin Jaguar on one of my retail outlet visits, I was excited to meet this gentleman from Guns N’ Roses who was taking delivery of his new Jaguar XKR. A very polite rockstar, Slash 🎸
Clicked by Brian Allan pic.twitter.com/BUeKZ1zkWl— Ratan N. Tata (@RNTata2000) January 14, 2022
Advertisements