రత్న ఇన్ ఫ్రా కంపెనీలో శుక్రవారం ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సంస్థలో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలతో రత్న కంపెనీలో ఈడీ సోదాలు చేపట్టింది. కంపెనీలో ఉన్న ఆర్థిక లావాదేవీలన్నింటినీ ఈడీ అధికారులు చెక్ చేశారు. అనంతరం కంపెనీలో ఉన్న ఉద్యోగులను కూడా అధికారులు ప్రశ్నించారు.
ఈ తనిఖీలపై రత్న ఇన్ ఫ్రా కంపెనీ స్పందించింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. మా సంస్థలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆదివారం ఉదయం వార్తా కథనాలు వచ్చాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-2లో ఉన్న మా రత్న ఇన్ ఫ్రా కంపెనీలో ఈడీ బృందం సాధారణ తనిఖీ నిర్వహించారు. సంస్థలో పని చేస్తున్న సిబ్బంది అందరూ వారికి పూర్తిగా సహకరించి, కావలసిన సమాచారాన్ని అందించడం జరిగిందని ప్రకటనలో తెలిపింది కంపెనీ.
ఆదివారం పత్రికలలో వచ్చినట్టుగా మా సంస్థ ఆంధ్ర ప్రదేశ్ లోని గోదావరి జిల్లాల్లో దళితుల పేరిట ఎలాంటి రుణాలు తీసుకోలేదని వెల్లడించింది. అలాగే మా సంస్థ తరపున ఎలాంటి గోదాములు నిర్మించలేదన్నారు. దానికి మా సంస్థకు ఎలాంటి సంబంధం లేదని రత్న కంపెనీ పేర్కొంది.
ఎన్ఆర్ఐ విద్యా సంస్థలో భవనాలను నిర్మించుకోవడానికి మాత్రమే.. మాకు కొంత మొత్తాన్ని అడ్వాన్స్ గా చెల్లించడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వలన మేము వాటిని నిర్మించలేకపోయాం. కాబట్టి ఆ సంస్థతో గానీ, ఆ సంస్థ అధినేత నిమ్మగడ్డ ఉపేంద్ర గారితో గానీ మాకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని పత్రికగా ముఖంగా విరణ ఇచ్చింది రత్న ఇన్ ఫ్రా కంపెనీ.