ప్రభుత్వ ఆసుపత్రుల నిర్లక్ష్యం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.బ్రతికి ఉన్నరోగులకే రక్షణ ఉండదు,ఇక శవాలకు ఉంటుందా.!?ఈ విషయంలో మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా ఆసుపత్రిలో జరిగిన దారుణ సంఘటనే ఉదాహరణ.హాస్పిటల్ మార్చురిలో భద్రపరిచిన ఓ మృతదేహం కన్ను కనిపించకుండా పోయింది.
అయితే కంటిని ఎలుకలు కొరికేశాయని డాక్టర్లు అనుమానిస్తున్నారు. గతంలో ఇదే హాస్పిటల్‌లో మృతదేహాన్ని కొరికిన ఉదంతాలు కూడా ఉన్నాయి. కాగా, ఈ ఘటనపై దవాఖాన ఉన్నతాధికారులు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులోభాగంగా మార్చురీలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
మృతదేహం కంటిని ఎలుకలు కొరికి ఉంటాయని ప్రాథమికంగా అంచనావేస్తున్నామని హాస్పిటల్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అభిషేక్ ఠాకూర్ చెప్పారు. అయితే దర్యాప్తులో అసలు విషయాలు తెలుస్తాయని వెల్లడించారు. కాగా, దవాఖానలో ఎలుకల బెడద, వైద్యుల నిర్లక్ష్యంపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.