ఫిబ్రవరి 11న ఖిలాడీ చిత్రంతో మాస్ మహారాజా రవితేజ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంతో పాటు రవితేజ రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ అలాగే రావణాసుర సినిమాలు చేస్తున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రావణాసుర సినిమాలో అక్కినేని సుశాంత్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఐదుగురు హీరోయిన్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు.
అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్,ఫరియా అబ్దుల్లా, దక్ష నాగార్కర్, పూజిత పొన్నాడ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఇక ఇందులో రవితేజ లాయర్ గా కనిపించనున్నాడు. అయితే తాజాగా ఓ ఫోటో రిలీజ్ చేశారు మేకర్స్. రెండవ షెడ్యూల్ పూర్తి అయింది అని చెప్తూ ఈ ఫోటో ను విడుదల చేశారు.
ఈ ఫోటోలో రవితేజ తోపాటు సుశాంత్ హీరోయిన్ గా దక్ష నాగార్కర్ డైరెక్టర్ సుధీర్ వర్మ కనిపిస్తున్నారు. ఈ సినిమాను అభిషేక్ నామా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.