మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ప్రస్తుతం రవితేజ చేతిలో ఖిలాడి, ధమాకా, టైగర్ నాగేశ్వరరావు, రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర చిత్రాలు ఉన్నాయి. రావణాసుర చిత్రం సుదీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీమ్ వర్క్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ఇక ఈ సినిమాలో లాయర్ పాత్రలో రవితేజ కనిపించనున్నాడట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో క్యారెక్టర్ ను మేకర్స్ రివీల్ చేశారు.
అక్కినేని సుశాంత్ ఈ సినిమాలో రామ్ పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటిస్తూ సుమంత్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సుమంత్ ఇందులో కొద్దిగా డిఫరెంట్ గా నెగిటివ్ షేడ్స్ ఉన్న లుక్ లో కనిపించాడు. మరి చూడాలి సుమంత్ పాత్ర ఎలా ఉంటుందో.