ఎదుటవారి కథలో మనమంతా చెడ్డోళ్ళమే అనే థీమ్ తో హీరో రవితేజతో సుధీర్ వర్మ తెరకెక్కించిన చిత్రం రావణాసుర. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్స్ మరియు ఆర్టీ మూవీ టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై అభిషేక్ అగర్వాల్, రవితేజ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
మాస్ మహరాజ్ సరసన మేఘ ఆకాష్, ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుండగా.. హీరో సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లో టైటిల్ కు తగ్గట్టే రవితేజ.. రావణాసురుడుగా కనిపించాడు. నగరంలో వరుస హత్యలను ఛేదించడానికి పోలీస్ ఆఫీసర్ జయరామ్ ప్రయత్నిస్తూ ఉంటాడు.
మొదటి సీన్ నుంచే రవితేజ … హత్యలు చేస్తూ కనిపించడం.. పోలీసులు అతని కోసమే వెతుకుతున్నారు అని చూపించారు. ఇక మరోపక్క లాయర్ గా రవితేజ, ఫరియా అబ్దుల్లాతో కలిసి ఒక కేసు కోసం వాదించడం కనిపిస్తుంది. అయితే ఆ కేసులో బలమైన సాక్ష్యం కోసం ఫరియా వెతుకుతూ ఉంటుంది.
ఇక అందరు వెతికేది మరెవరినో కాదు..క్రిమినల్ లాయర్ అయిన రవితేజను అని తెలుసుకుంటారు. అయితే రవితేజ ఆ హత్యలు ఎందుకు చేస్తున్నాడు. కేవలం అమ్మాయిలను మాత్రమే టార్గెట్ చేయడం వెనుక ఉన్న కారణం ఏంటి అనేది ట్విస్ట్ గా చూపించారు.
ఇక చివర్లో జోకర్ లా రవితేజను చూపించడం హైలైట్ గా నిలిచింది. మనసులో ఎంత బాధ ఉన్నా పైకి నవ్వే జోకర్ లానే రవితేజ క్యారెక్టర్ ఉండబోతుందని చూపించారు. ఇక రెండు, మూడు డైలాగ్స్ ట్రైలర్ లో అదరగొట్టేశాయి అని చెప్పాలి.
‘వాడు క్రిమినల్ లాయర్ కాదు.. లా చదివిన క్రిమినల్’.. మర్డర్ చేయడం క్రైమ్.. దొరక్కుండా మర్డర్ చేయడం ఆర్ట్.. నేను ఆర్టిస్ట్ ను”, ఈ భూమి మీద ఎవరైనా నన్ను ఆపగలిగేవాడు ఉన్నాడంటే .. అది నేనే అని రవితేజ చెప్పిన డైలాగ్స్ మాత్రం అదిరిపోయాయి.
ఇక హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం హైలైట్ గా నిలిచింది. మొత్తానికి ట్రైలర్ తోనే నిజంగా రవితేజను రావణాసురుడుగా చూపించి డైరెక్టర్ మార్కులు కొట్టేశాడు. మరి థియేటర్ లో ప్రేక్షకులు ఎన్ని మార్కులు ఇస్తారో తెలియాలంటే.. ఏప్రిల్ 7 వరకు ఆగాల్సిందే.