సినీ పరిశ్రమలోకి వారసులు ఎంట్రీ ఇవ్వడం కామనే. సౌత్ నుంచి.. నార్త్ నుంచి ఇప్పటి వరకు చాలా మంది తారలు ఇండస్ట్రీలోకి వచ్చారు. వారిలో కొంత మంది నిలదొక్కుకుంటే.. కొందరు అయితే కనీసం కనిపించడం కూడా లేదు. బాలీవుడ్ లో ఆలియా భట్, అనన్య పాండే, జాన్వీ కపూర్ వంటి ముద్దుగుమ్మలు వారసత్వంతో వచ్చిన వారే.
ఈ క్రమంలోనే సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ వారసురాలు బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది. ఒకప్పుడు తన అందాలతో యూత్ ను ఆకట్టుకున్న స్టార్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు త్వరలో హీరోయిన్‌గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుందని ఎప్పటి నుంచో ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం. ఈ టాక్ బయటకు రావడంతో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. హాట్ హాట్ ఫోటోషూట్స్ తో ఇప్పటికే సందడి చేస్తోంది. ఫాలోయింగ్ తో పాటు.. రవీనా కూతురిగా ఇమేజ్ కూడా ఉండటంతో బాలీవుడ్ ఎంట్రీకి ఆమెకు రూట్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. దాంతో త్వరలోనే ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైనట్టు సమాచారం
ఇక్కడ మరో విశేషం ఏంటంటే..రాషా తడానీ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుండగా.. ఈసినిమాతో అజయ్ దేవగణ్ మేనల్లుడు అమన్ దేవగణ్ హీరోగా నటించబోతున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరు జంటగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టబొతున్నారు. ఈ యంగ్ కపుల్ ఎంట్రీ మూవీని అభిషేక్ కపూర్ నిర్మిస్తున్నారు. మార్చి నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని ఈ సమాచారం. ఈ సినిమా కథ రాషా వినడం.. అంతా ఓకే అయిపోయి సైన్ చేయడం కూడా అయిపోయిందని సమాచారం.
అంతే కాదు ఈసినిమాలో అజయ్ దేవగణ్ కూడా నటిస్తున్నాడట. అజయ్ దేవ్ గణ్ మునుపెన్నడు కనిపించనంత వెరైటీ పాత్రలో కనిపించనున్నాడట అజయ్. ఈ వార్త వినిపించడంతో.. అందరి దృష్టీ రవీనా వారసురాలిపై పండింది. ఈవార్త తెలిసి ఆమె గురించి గూగుల్ లో వెతుకుతున్నారు బాలీవుడ్ జనాలు. ఆమె అందాలకు ఫిదా అవుతున్నారు. మరి రాషా సినిమాల్లో ఎలా రాణిస్తుందో చూడాలి.