బాలీవుడ్ నటి రవీనా టాండన్, డైరెక్టర్-కొరియోగ్రాఫర్ పర్హా ఖాన్, కమెడీయన్ భారతిసింగ్ లపై పంజాబ్ లోని అమృత్ సర్ పోలీసులు కేసు నమోదు చేశారు. టెలివిజన్ షో లో క్రిస్టియన్ల మత విశ్వాసాలను అవమానపర్చినందుకు కేసు నమోదు చేసినట్టు తెలిసింది. క్రిస్మస్ రోజు ప్రసారమైన టీవీ కార్యక్రమంలో తమ మతాన్ని అవమానపర్చారంటూ క్రిస్టియన్ ఫ్రంట్ ప్రెసిడెంట్ సోనూ జఫర్ ఫిర్యాదు చేశాడు. టీవీలో ప్రసారం చేసిన వీడియో పుటేజ్ ను కూడా ఫిర్యాదు తో పాటు పోలీసులకు అందజేశాడు.అజ్నాలా పోలీస్ స్టేషన్ లో ఎఫ్.ఐ.ఆర్ చేసి విచారణ చేస్తున్నట్టు అమృత్ సర్ రూరల్ ఎస్.ఎస్.పి విక్రమ్ జీత్ దుగ్గల్ తెలిపారు.