సినీ పరిశ్రమలో డ్రగ్స్ దందాపై లోక్‌సభలో తాను చేసిన వ్యాఖ్యలను జయాబచ్చన్ సమర్థిస్తారనుకున్నానని నటుడు, ఎంపీ రవికిషన్ అభిప్రాయపడ్డారు. ఇండస్ట్రీలో అందరూ డ్రగ్స్ తీసుకుంటున్నారని తాను అనలేదని వివరణ ఇచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఇండస్ట్రీని అంతం చేయడానికి కొందరు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జయబచ్చన్, నేను ఇండస్ట్రీలో వెళ్లినపుడు పరిస్థితి ఇంత దారుణంగా లేదని.. కానీ ఇప్పుడు ఇండస్ట్రీని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చిందని రవికిషన్ స్పష్టం చేశారు.
అంతకుముందు రవికిషన్‌ను ఉద్దేశించిన జయాబచ్చన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమ నుంచి వచ్చిన వ్యక్తి.. పరిశ్రమ గురించి చెడుగా మాట్లాడటం సిగ్గుచేటని తీవ్రవ్యాఖ్యలు చేశారు. అయన ఆలా మాట్లాడినందుకు తానూ సిగ్గుపడుతున్నాన్నారు జయాబచ్చన్. ఈవ్యాఖ్యలపై రవికిషన్ పై విధంగా స్పందించారు.